NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్ధినీ విద్యార్థులకు కెరీర్ ఎవేర్నెస్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పై ట్రైనింగ్

1 min read

నేటి పోటీ ప్రపంచంలో సరైన ప్రణాళికతో వివిధ అంశాల పట్ల సరైన అవగాహన సాధించడం ఎంతో అవసరం

కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఎమ్.రత్నాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల కెరీర్ గైడెన్స్ మరియు ప్లేస్మెంట్ సెల్, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సంయుక్త ఆధ్వర్యంలో 2026-2027  విద్యాసంవత్సరములో డిగ్రీ ఆఖరు సంవత్సరము చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులకు “కెరీర్ ఎవేర్నెస్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్” అనే అంశముపై అవగాహనా సదస్సు ను కళాశాల ఆడిటోరియం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమమునకు కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ శ్రీ ఎమ్. రత్నాకర్, కరస్పాండెంట్ డా: కె. ఎస్. విష్ణుమోహన్, ఐ.క్యూ.ఎ.సి కో-ఆర్డినేటర్ డా: జి.రాము, జిల్లా ఎంప్లాయిమెంట్ మరియు స్కిల్ ఆఫీసర్ డా:పి.వి.రమేష్ కుమార్, ప్రాంతీయ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఎన్. రామమోహన్ రెడ్డి, డి.ఎస్.డి.ఒ.ఎన్. జితేంద్రబాబు,పోటీపరీక్షల ట్రైనర్ ఎ.హరికృష్ణ పాల్గన్నారు. కార్యక్రమములో భాగముగా కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఎమ్. రత్నాకర్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో సరైన ప్రణాళికతో వివిధ అంశాల పట్ల సరైన అవగాహన సాధించడం ద్వారా పోటీ పరీక్షలలో ఖచ్చితమైన విజయం సాధించడం సులభతరమౌతుందని, తద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ డా|| కె. ఎస్. విష్ణుమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ పోటీపరీక్షలకు సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన ప్రారంభంనుండే ఏర్పరుచుకోవడం ద్వారా సమాజానికి మెరుగైన సేవలందించే పబ్లిక్్సర్వీస్ కమీషన్ పరీక్షలను చాలా సులభంగా ఎదుర్కోని జీవితంలో స్థిరపడవచ్చునని తెలిపారు. కళాశాల ఐ.క్యూ. ఎ.సి. కో ఆర్డినేటర్ డా॥ జి.రాము మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమములకు హాజరయి, పోటీపరీక్షలను ఎలా ఎదుర్కోవాలో, ఏఏ అంశాలలో నైపుణ్యం సాధించాలో నేర్చుకోవాలని సూచించారు. జిల్లా ఉపాధి కార్యాలయం నుండి హాజరైన అధికారులు ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల విధానము, పెంపొందించుకొనవలసిన నైపుణ్యములు, అనుసరించవలసిన ప్రణాళికలు, వివిధ పోటీ పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు ఎదురయ్యే అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధినీ విద్యార్థులకు పి.పి.టీ ద్వారా వివిధ పోటీ పరీక్షల సిలబస్లు, నమూనా ప్రశ్నలు, పోటీ పరీక్షలలో విజయం సాధించిన విజేతల అనుభవాలను వీడియోల ద్వారా ప్రదర్శించారు. చివరగా విద్యార్ధినీ విద్యార్ధుల యొక్క సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమము ఆఖరులో కళాశాల యాజమాన్యము తరుపున జిల్లా ఉపాధికార్యాలయ మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియపరచడంతో కార్యక్రమమును ముగించినారు.

About Author