చిన్నహుల్తి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ను నియమించండి
1 min read
ఎంపీడీవోకు సిపిఐ వినతిపత్రం అందజేత
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ మండలంచిన్నహుల్తి గ్రామ సచివాలయంలో గత 18 నెలలుగా డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడంతో చిన్నహుల్తి, పెద్దహుల్తి గ్రామాల ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వ సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున వెంటనే డిజిటల్ అసిస్టెంట్ న నియమించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. సీపీఐ పెద్దహుల్తి శాఖ కార్యదర్శి సిద్దు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోసీపీఐ మండల కార్యదర్శి కారుమంచి, చేతి వృత్తుదారుల సమైక్య జిల్లా కార్యదర్శి ఎం. కారన్న, రైతు సంఘం నాయకులు ఎంపీటీసీ వీరన్న మాట్లాడుతూ, చిన్నహుల్తి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడంతో ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధిత ధ్రువీకరణ పత్రాల కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే శాశ్వత డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించి రెండు గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.దీనిపై స్పందించిన ఎంపీడీవో, రేపటి నుంచి చిన్నహుల్తి గ్రామ సచివాలయంలో ప్రతిరోజూ రెండు గంటల పాటు పంచాయతీ కార్యదర్శి కార్తీక్ అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందిస్తారని హామీ ఇచ్చారు. అలాగే డిజిటల్ అసిస్టెంట్ నియామకానికి సంబంధించిన అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దహుల్తి సీపీఐ నాయకులు, మదన్న వీరేష్ రవి నరసింహలు రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


