NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవనకొండ మండల సాగునీటి సమస్యలు పరిష్కరించండి… సిపిఎం

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆలూరు నియోజక వర్గం ఆస్పరి మండల కేంద్రానికి ఈ నెల 25వ తేదీ వస్తున్న నేపథ్యంలో దేవనకొండ మండలంలోని సాగునీటి సమస్యల పై దృష్టి పెట్టాలని వాటిని పరిష్కరించాలని సిపిఎం జిల్లా నాయకులు బి. వీరశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుండి సిపిఎం కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ దగ్గర సాగునీటి సమస్యల పరిష్కారానికి రాస్తారోకో కార్యక్రమంలో నిర్వహించారు ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు ముక్కెళ్ల అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు బి వీరశేఖర్ మండల కమిటీ సభ్యులు యూసుఫ్ భాష, కోట కొండ సూరి లు మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిష్కారంపై ఉద్దేశించబడి నిర్మాణమైన హంద్రీనీవా ప్రాజెక్టు తొలి దశలోనీ పందికొన రిజర్వాయర్ నుండి 65 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా అందులో దేవనకొండ మండలానికి 46 వేల ఎకరాలకు  సాగుబడి ఉందని అయితే సంవత్సరాలు గడుస్తున్నా పంట కాల్వల నిర్మాణం లేక ఒక ఎకరా కూడా ప్రభుత్వం అధికారికంగా సాగునీరు ఇవ్వడం లేదని పేర్కొన్నారు కాలువలు వెంబడి పోతున్న నీరును ఒడిసిపెట్టి మోటార్ల ద్వారా రైతులు అనేక  వ్యయ ప్రయాసలకు  ఓర్చి పైపుల ద్వారా నీళ్లు కట్టుకుంటున్నారని దీనివల్ల కొంతమందికే సాగునీరు దక్కుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి పంట  కాల్వల నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా హంద్రీనీవా పనులు కరివేముల తెర్నేకల్ కప్పట్రాళ్ల మధ్య పెండింగ్ లో ఉన్నాయని ప్రధాన కాల్వ పూర్తి కాలేదని వెంటనే ప్రధాన కాలువ పెండింగ్ పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.

About Author