NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని లయన్స్ క్లబ్ మద్దతు

1 min read

జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శికి వినతిపత్రం అందజేత.

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను  ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఉద్యమానికి లయన్స్ క్లబ్  అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు, అసోసియేషన్ అఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్  జిల్లా 117స్ సభ్యులు తమ సంపూర్ణ మద్దతును ఇస్తామని, ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్  జిల్లా 117s గవర్నర్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ ఫోర్ట్  చార్టర్ మెంబెర్ అడ్వకేట్ లయన్ పద్మశాలి వెంకటేశ్వర్లు తదితర క్లబ్ మెంబర్లు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. చంద్రుడు మరియు కార్యదర్శి టి. మహేశ్వర రెడ్డి లకు కర్నూలు బార్ అసోసియేషన్ కార్యాలయంలో కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, రాయలసీమ ప్రజలకు న్యాయ సేవలు సులభంగా అందుబాటులోకి రావాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అత్యవసరమని పేర్కొన్నారు. న్యాయవాదులు, ప్రజా సంఘాలు, వివిధ సంస్థలు చేపడుతున్న ఉద్యమానికి తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజలకు సమాన న్యాయ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అన్ని వర్గాల మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, న్యాయవాదులు ఎస్ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు.

About Author