NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎం పి ఈ ఓ ల సమస్యలు పరిష్కరించండి  

1 min read

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. డిమాండ్ 

న్యూస్ నేడు, పత్తికొండ: వ్యవసాయ శాఖలో ఎంపీఈవోలగా పనిచేస్తున్న వారి సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి రాజా సాహెబ్ డిమాండ్ చేశారు. ఎంతోకాలంగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ఎంపీ ఈవో లను రెగ్యులర్ చేసి, వేతనాలు పెంచాలని సమస్యల పరిష్కారం కోసం గత వారం రోజులుగా చేస్తున్న ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గత 12 సంవత్సరాలు నుండి ఎంపీవోలుగా చేరి కేవలం 12 వేల గౌరవ వేతనంతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. అలాగే వారికిచ్చే అతి తక్కువ జీతం కూడా 5 నెలల నుండి పెండింగ్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారికి తక్షణమే రెన్యూవల్ (జీవో )ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు  సమాన పనికి సమాన వేత్తం కనీసం 36,000 ఇవ్వాలని,  అదే విధంగా 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎంపీఈఒలను రెగ్యులర్ చేయాలని, వారికి ప్రమాద బీమా  సదుపాయం కల్పించాలని ఆయన కోరారు. అలాగే హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

About Author