NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పౌరసరఫరాలశాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 26 వేల ఇవ్వాలి

1 min read

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటియుసి డిమాండ్

జిల్లా మేనేజర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేత

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలశాఖ ఏలూరు జిల్లా మేనేజర్ కార్యాలయంలో మరియు జిల్లాలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటియుసి ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వర రావు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘం జిల్లా నాయకులు ఎం బాలకోటి డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఏలూరు కలెక్టరేట్ పరిధిలో ఉన్న పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎఐటియుసి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా  నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా మేనేజర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు, పది, పదిహేను సంవత్సరాలు సర్వీస్ వున్న ఉద్యోగులకు ఒకే రకమైన వేతనం చెల్లిస్తున్నారని వారు పేర్కొన్నారు. సర్వీస్ ఆధారంగా వేతనాలు పెంచాలని, ప్రస్తుత నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకి 26000 ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎం మంగయ్య, ఎం జోస్నా, సిహెచ్ సువర్ణ లత , పి దుర్గా దేవి, వి. గణేష్, సుధాకర్,కోటి, సత్యనారాయణ, ఖాన్, స్వామి, రత్నం తదితరులు పాల్గొన్నారు.

About Author