ఆలూరు నియోజకవర్గ ప్రజా సమస్యలపై వైఎస్ జగన్‌తో ఎమ్మెల్యే భేటీ
1 min read
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఆరా తీసిన వైఎస్ జగన్
ఆలూరు న్యూస్ నేడు: తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, వైఎస్సార్సీపీ నాయకుడు వైకుంఠం మల్లికార్జున చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు, ప్రజల అభిప్రాయాలు, పార్టీ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.ఆలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, కార్యకర్తలతో సమన్వయం, ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటాల గురించి ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, నాయకుడు వైకుంఠం మల్లికార్జున చౌదరి వైఎస్ జగన్‌కు వివరించారు.


