NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిషన్ వాత్సల్య పోర్టల్ లో దత్తత కార్యక్రమం అనుసంధానం చేయబడింది

1 min read

3 నెలల వయస్సు పాపను తమిళనాడు కి చెందిన కుమారీ,మధు శ్రీనివాసన్ దంపతులకు దత్తత

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శిశు గృహ లో తాత్కాలిక వసతి పొందుతున్న బేబీ కృతిక అను 3 నెలల వయస్సు గల పాపను చెన్నై , తమిళనాడు కి చెందిన కుమారీ,మధు శ్రీనివాసన్ దంపతులకు గురువారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా  కలెక్టర్  కె. వెట్రిసెల్వి  దత్తత తల్లి అయిన కుమారి మధు శ్రీనివాసన్ కి  బేబీ కృతిక ను  అందించారు.  వీరు 2022 లో అడాప్షన్ కి కార నందు దత్తత కొరకు అర్జీ పెట్టుకొనగా వీరి యొక్క సీనియారిటీ బట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు నందుగల కృతిక అనే పాపను మిషన్ వాత్సల్య పోర్టల్ ద్వారా రెఫరల్ వెళ్లగా రిజర్వ్ చేసుకున్నారు.  దత్తత కమిటీ వారు అన్నీ ధ్రువపత్రాలు సరిచూసిన తర్వాత గురువారం ఈ రోజు జిల్లా మేజిస్ట్రేట్ వారి ద్వారా బేబీ నీ అందించారు. ఈ దత్తత కార్యక్రమంలో మహిళా భివృద్ధి మరియు శిశు సంక్షేమ  సాధికారిత అధికారి పి.శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి   సి. హెచ్ సూర్య చక్రవేణి , శిశుగృహ మేనేజర్ కె. భార్గవి మరియు నర్స్ ఎ. విశాలి  తదితరులు పాల్గొన్నారు.

About Author