గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం
1 min read
– సులువాయి గ్రామంలో వాటర్ ట్యాంక్ ప్రత్యేక శుభ్రపరిచే కార్యక్రమం
స్వచ్ఛమైన తాగునీటి కోసం పంచాయతీ ఆధ్వర్యంలో పరిశుభ్రత చర్యలు
హొళగుందన్యూస్ నేడు: హొళగుంద మండలం సులువాయి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో గ్రామంలోని ప్రధాన తాగునీటి వాటర్ ట్యాంక్‌ను పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్యాంకులో పేరుకుపోయిన మలినాలు, చెత్తను పూర్తిగా తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. అనంతరం ట్యాంకుకు శానిటైజేషన్ నిర్వహించి తాగునీటి నాణ్యత మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, వాటర్ సప్లై సిబ్బంది సమన్వయంతో పనులను విజయవంతంగా పూర్తి చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ అధికారులు మాట్లాడుతూ, గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటువంటి పరిశుభ్రత కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పంచాయతీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ చేపడుతున్న ఈ చర్యలను స్థానికులు అభినందించారు.


