NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాతృశక్తి జాగరణతోనే దేశం సర్వతోముఖాభివృద్ది

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి. తి. దే.

ఘనంగా ముగిసిన తి.తి.దే. ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు: మాతృశక్తి జాగరణతోనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, మాతృశక్తి అనేది కేవలం కుటుంబానికే కాదు, సమాజానికీ, దేశానికీ మూలాధారమని, మాతృశక్తి మేల్కొంటే కుటుంబం వికసిస్తుందని, కుటుంబం వికసిస్తే సమాజం బలపడుతుందని,  సమాజం బలపడితే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ  కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి మండల కేంద్రమైన జూపాడు బంగ్లాలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. మూడురోజులు జి. వెంకట రమణయ్య చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలి నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ నిర్వాహకులు ఇల్లూరి లక్ష్మీనారాయణ శ్రేష్ఠి, అర్చకులు సత్యమయ్య, శివయోగి సిద్దరామేశ్వర నాగలింగేశ్వర బ్రహ్మవిద్యా ఆశ్రమం నిర్వాహకులు గోవిందుస్వామి, ధర్మ ప్రచార మండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి, అన్నదాన సత్రం నిర్వాహకులు రామయ్య, స్కాలర్స్ ఇ. మీ. పాఠశాల ప్రిన్సిపాల్ కాళ్ళూరి లక్ష్మి,  అర్చకులు ఉమ్మయ్య, భజన మండలి సభ్యులు చిన్నతిరుపాలు, జి.రంగస్వామి, బాబు, రాము, కృష్ణమూర్తి, నాగశేషులు, నారాయణరెడ్డి, వెంకటరమణ, శ్రీవీరభద్రస్వామి దేవస్థానం పూజారి పాండురంగస్వామి, మల్లిఖార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author