NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల  ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం

1 min read

యనమలకుదురు, న్యూస్​ నేడు: రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరమ ప్రసాద్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఇక్కడకు విచ్చేసిన విద్యార్థిని విద్యార్థుల తల్లి తండ్రులకు నమస్కారం తెలుపుతూ,జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల   ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని, ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులను ప్రతి రోజు ఉదయం 9 గంటలకు కల్లా వారిని పాఠశాలకు పంపించడమే బాధ్యత తీసుకోమని,చదువు వారి క్రమశిక్షణ వాటి బాధ్యత పాఠశాలలో ఉన్నఉపాధ్యాయులు వారిని మంచి విద్యార్థి, విద్యార్థులుగా తీర్చిదిద్దుతారని తెలిపారు.మన యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు వారి చదువుకు తగ్గట్టుగా మంచి భవిష్యత్తు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని ధైర్యంచెప్పారు.కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, చదువుకున్న పిల్లలకు మంచి భవిష్యత్తు  ఉంటుందనిది తెలిపారు. కుటుంబంలో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ద్వారా 15000రూ ..కూటమి ప్రభుత్వం ఇస్తుందని, కేవలం తల్లిదండ్రులు పిల్లల చదువుల పైనే దృష్టి పెట్టాలని, పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని, ఉన్నతమైన ఉద్యోగాలు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు. విద్యార్థిని విద్యార్థులకు పెట్టె భోజన సదుపాయాల్లో కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. పిల్లలు మంచి చదువులు చదువుకొని ప్రయోజకులు అయితే వారి ద్వారా కుటుంబాన్ని పోషించుకునే అవకాశం మెండుగా ఉంటుందని, స్థానికంగా తల్లికి వందనం రాని వారు ఎవరైనా ఉంటే వారు పాఠశాలలో ఉన్న H.M  ద్రుష్టి కి తీసుకురమ్మని,ఆ బాధ్యత స్థానిక శాసనసభ్యులు, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  మంత్రివర్యులు నారా లోకేష్  ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉన్నత విద్యను అందించి పిల్లల తల్లితండ్రుల మనలను పొందుతున్నాయి అన్నారు.కావున విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టి వారి చెడు వ్యసనాలకు లోను కాకుండా ప్రతిరోజు వారి కదలికలను మానిటరింగ్  చేసే బాధ్యత తీసుకొన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై తీసుకునే శ్రద్ధ వారి భవిష్యత్తుకు దోహదపడుతుందన్నారు. ఇంటి దగ్గర ఉన్నంతవరకు  వారి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని,  పాఠశాలలో ఉన్నంతవరకు వారి బాధ్యత పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు తీసుకుంటారని, వారిని ప్రయోజకులను చేసే బాధ్యత  కూటమి ప్రభుత్వంతోపాటు తల్లి తండ్రులు కూడా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్  k శిరీష స్టాఫ్ సెక్రటరీ n తోజెస్  స్కూల్ కమిటీ చైర్మన్ కే దేవి తాడిశెట్టి వీరస్వామి బలగం కొండ చిర్రాఉరి శేషు వెలగపూడి రామచంద్రరావు మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author