ఆశా వర్కర్ల సమస్యలపై 31న చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని,పర్మినెంట్ చేయాలని,పని భారాలు తగ్గించాలని,అన్నిరకాల సెలవులు ఇవ్వాలని,మట్టి ఖర్చులు ఇవ్వాలని,నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని,శిక్షణ పొందిన ఎఎన్ఎం,జిఎన్ఎం లకు పర్మినెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని,పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలని తదితర సమస్యల పరిష్కారం కొరకు జూలై 31న చేపడుతున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శివరాం,మండల కో కన్వీనర్ బి.నాగమద్దయ్య,మండల నాయకులు పి.రామాంజనేయులు,ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు బి.వెంకటేశ్వరమ్మ ఆశా వర్కర్లకు పిలుపునిచ్చారు.ఈ మేరకు శనివారం కొత్తపేటలోని రోకలి బండ సత్రం,పాతపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నందు వైద్య అధికారులను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాలు సమర్పించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు పెంచి 7 సంవత్సరాలు దాటినా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.20 సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు సెలవులు లేకపోవడంతో అనారోగ్యాల పాలు అవుతున్నారని కనుక అంగన్వాడీలకు అమలవుతున్న విధంగా అన్ని రకాల సెలవులు (వేసవి శెలవులు మినహా) వారాంతపు సెలవులు,నేషనల్ హాలిడేస్,పండగ సెలవులు,క్యాజువల్ లీవులు,మెడికల్ లీవులు ఇవ్వాలని,ఆశా వర్కర్లుకు ప్రభుత్వం చెల్లించే 10 వేలలో నెలలో పి హెచ్ సి లకు ఆసుపత్రులకు వెళ్ళడానికే 3,4 వేలు ఖర్చులు అవుతున్నాయని కనుక టిఏ డిఏ లు ఇవ్వాలని,సంబంధంలేని పనులు చేయించడం అధిక జనాభాలో పనిచేయటం వలన ఆశా వర్కర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని కనుక పని ఒత్తిడి తగ్గించాలని,కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్చాలని,10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని,నాణ్యమైన మొబైల్స్,యూనిఫామ్ ఇవ్వాలని,గ్రాబ్యూటీకి సీలింగ్ ఎత్తివేయాలని తదితర సమస్యల పరిష్కారం కొరకు అనేక సంవత్సరాలుగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆశాల సమస్యలు పరిష్కరించాలని లేని యెడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆశాలు కమలమ్మ,భారతి,మాధవి చంద్రకళ,లక్ష్మి,లావణ్య,కుల్లాయమ్మ,లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


