అంగరంగ వైభవంగా 15 ఏళ్ల తర్వాత పూజలందుకున్న యాగనందీశ్వర స్వామి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వరుణ దేవుడి కరుణ కోసం వెలుగోడు మండలం వెలుగోడు గ్రామ ప్రజల నమ్మకార్ధం రైతు సంఘం ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా గ్రామంలో ప్రతి విధిలో జరుగుతున్న యాగనందిశ్వర స్వామి భజనలు పూజలు నేడు పూర్తి చేసుకుని వెలుగోడు గ్రామం నుండి 15 కిలోమీటర్ల సమీపంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలసిన యగనందీశ్వర స్వామి కి నేడు భక్తులు భారీ ఎత్తున కదిలి గోవింద నామాలు స్మరిస్తూ స్వామి వారికి తీర్థప్రసాదాలు సమర్పించి భక్తి భజనలు చేయడం జరిగింది. కార్యక్రమం అనంతరం వేలాదిమందిగా తరలివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.


