NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో  ముఖ్యమంత్రి సమీక్ష

1 min read

జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో  ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : ఏలూరు జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమం ద్వారా 184.19 కోట్ల రూపాయలతో 1943 పనులు చేపట్టి 1939 పనులు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలిపారు. జలధార-జలహారతి కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయం నుండి శనివారం  సంబంధిత శాఖల కార్యదర్సులతో కలిసి జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో  ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ జలధార-జలహారతి కార్యక్రమం రాష్ట్రంలో 100 రోజులలో విజయవంతంగా పూర్తిచేసి, జలసంరక్షణ పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం  100 రోజులకె  పరిమితం కాకుండా నిరంతర ప్రక్రియ లాగా కొనసాగాలన్నారు.  జలసంరక్షణ కు తీసుకోవలసిన మరిన్ని చర్యలను జలవనరుల శాఖ ద్వారా అధ్యయనం చేసి, ఇరిగేషన్ శాఖ నిధులతో పనులు చేపట్టాలన్నారు. త్రాగునీటి వనరులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  ఈ సందర్భంగా కలిదిండిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను  పరిశీలన అనంతరం కలిదిండి  ఎంపిడిఓ  కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏలూరు జిల్లాలో చేపట్టిన పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గతంలో గ్రామీణ ఉపాధిహామీ పధకం ప్రస్తుతం విభిజి రామ్ జి కార్యక్రమంలో జలధార-జలహారతి కార్యక్రమంలో 1912 పనులు సిఎస్ఆర్ నిధుల ద్వారా 31 పనులు మొత్తం 1943 పనులకుగాను 1939 పనులు పూర్తిచేశామన్నారు. సాగునీటి వినియోగదారుల సంఘాల ద్వారా 91. 67 కోట్ల రూపాయలతో 378  ఓ అండ్ పనులు చేపట్టామన్నారు. వీటిలో 634 మైనర్ ఇరిగేషన్ చెరువులు పునరుద్ధరణ పనులు, 403 ఫీడెర్ చానెల్స్ లో పూడిక తీత పనులు, 866 మైనర్ కెనాల్స్  మరమ్మత్తులు , సీఎస్ఆర్ నిధుల ద్వారా 33 పనులు చేపట్టామన్నారు. వీటి ద్వారా జిల్లాలోని కాల్వలు, చెరువులు, నీటి వనరులలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. డ్వామా పీడీ కె. వి. సుబ్బారావు, ఇరిగేషన్ శాఖాధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author