ముఖ్యమంత్రి పర్యటన మీటింగ్ ప్రాంగణాన్ని పరిశీలన
1 min read
మార్కెట్ యార్డ్, హెలిపాడ్, మీటింగ్ ప్రాంగణాన్ని పరిశీలన
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఈనెల 10వ తారీఖున కలిదిండి మండలం, కలిదిండి నందు జరగబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ, కలిదిండి మార్కెట్ యార్డ్, హెలిపాడ్, మీటింగ్ ప్రాంగణాన్ని పరిశీలించి కార్యక్రమం విజయవంతం చేయడం పై స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి , సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ , ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి).ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, కో- కన్వీనర్ కొడాలి వినోద్ , నియోజకవర్గ అబ్జర్వర్ గంట త్రిమూర్తులు, ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న , మార్కెట్ యార్డ్ చైర్మన్ కురెళ్ళ ఏడుకొండలు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వల్లభనేని శ్రీనివాస్ చౌదరి, మరియు క్లస్టర్ ఇన్చార్జులు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


