NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయచోటిలో వైసీపీ శ్రేణుల యువగర్జన..!

1 min read

డీఎస్సీ అక్రమాలు.. నిరుద్యోగ భృతి.. ఫీజు బకాయిలపై వైసీపీ సమరశంఖం

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.

వై సిపి  కార్యాలయం వద్దే కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగ యువత

డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ జరపాలని డడిమాండ్

హామీలను అమలు చేయాలిఅంటూ హోరెత్తిన నినాదాలు

అన్నమయ్య జిల్లా ఆగస్టు 10 (న్యూస్ నేడు ప్రతినిధి) : డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని.. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని.. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాయచోటిలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరుబాటకు యువత భారీగా కదిలింది.వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించ తలపెట్టిన భారీ శాంతియుత ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుంచి విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, యువజన సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయ ప్రాంగణం యువశక్తితో కిక్కిరిసిపోయింది.

ఫీజు బకాయిలతో విద్యార్థుల అవస్థలుయువత పెద్దఎత్తున తరలిరావడంతో వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  మున్సిపల్ మాజీ చైర్మన్ ఫయాజ్ బాష,వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి దేవనాధరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైఎస్ఆర్ సిపి స్టేట్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, మండలాల కన్వీనర్లు నవాజ్, మిట్టపల్లె యదుభూషన్ రెడ్డి, మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, గడికోట జనార్దన రెడ్డి,ఉదయ్ కుమార్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి,రామాపురం జెడ్ పి టి సి మాసన వెంకట రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్,  వైఎస్ఆర్ సీపీ జిల్లా విద్యార్థి సంఘ అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్, యువజన విభాగం నియోజక వర్గ అధ్యక్షుడు మడితం రెడ్డికుమార్,ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప ,బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ భాస్కర్, నియోజక వర్గ ఎస్  సి సెల్ అధ్యక్షుడు సగినాల శివ శంకర తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి యువత,విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *