NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు

1 min read

వివిధ సేవల రూపేణా రూ:2,34,351/-లు ఆదాయం

సుమారు 2467 భక్తులకు నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ

అసిస్టెంట్ కమీషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మంగళవారం కావున ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం మండలం,గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము ఈ రోజు మంగళవారం సందర్భముగా  చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. ఈ కార్యక్రమములో ఆలయ ధర్మకర్తలు ఓబిలినేని సూర్య భవాని,ధూళిపాళ్ల సూర్యచంద్ర వెంకట ప్రభాకరరావు, ధూనబోయిన నారాయణ మూర్తి,ఆరుగొల్లు సావిత్రి పాల్గొనినారు.మంగళవారం మద్యాహ్నం గం.4-00 ని.ల వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.2,34,351/- లు ఆదాయము వచ్చినది. ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్ధం మద్యాహ్నం  గం.4-00 వరకూ విచ్చేసిన సుమారు 2467 భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినదని ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షులు రాజాన సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *