మలేరియా,డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలి
1 min read
-రాష్ట్ర మలేరియా అధికారి కొండారెడ్డి..
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: మలేరియా,డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మలేరియా అధికారి కొండారెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మిక అతనిఖీ చేశారు.ఆస్పత్రికి రోగులు ఎంతమంది వస్తున్నారు.ఓపి మరియు మలేరియా రిజిస్టర్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.తర్వాత ల్యాబ్ ను పరిశీలించారు.నాగలూటిలో ఇంటింటికీ వెళ్లి మలేరియా డెంగ్యూ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాటి జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. వర్షాకాల సీజన్ కాబట్టి జ్వరాలు వస్తే ఎప్పటికప్పుడు మలేరియా టెస్టులు చేయాలని అదేవిధంగా రోగాలు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర్,మెడికల్ ఆఫీసర్లు రాజు,వ్యోమకేష్, సబ్ యూనిట్ అధికారి రామకృష్ణ,సీహెచ్ఓ సురేష్ బాబు,సూపర్వైజర్ రామతులసి,సీనియర్ అసిస్టెంట్ చిరంజీవి,ఏఎన్ఎం రాధ, ఎల్ టి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.



