అవయవ దానం ద్వారా మరొకరికి పునర్జన్మ
1 min read
– అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
కర్నూలు, న్యూస్ నేడు: అవయవ దానం ద్వారా మరణానంతరం కూడా మనిషి మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చుని అసోసియేషన్ ఆఫ్ ఆలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్, లయన్స్ జిల్లా చైర్ పర్సన్, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు.ప్రపంచ అవయవ దాన అవగాహన దినోత్సవం పురస్కరించుకొని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117స్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన అవగాహన మరియు అవయవ దానం -అపోహలు అనే అంశంపై జరిగిన వ్యాసరచన పోటీల కార్యక్రమంలో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూగుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వంటి అవయవాలను అవసరమైన వారికి దానం చేయవచ్చని,ఒక వ్యక్తి అవయవ దానం ద్వారా పలువురు ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్నారు. అనంతరం అవయవదానంపై జరిగిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు కె.వి.ఆర్ కళాశాల విద్యార్థినిలు, నైస్ స్వచ్ఛంద సేవ సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం అవయవదానంపై అవగాహన గోడ పత్రికలను విడుదల చేశారు.


