గురుకుల పాఠశాలలో మొక్కలు నాటిన ప్రిన్సిపాల్..ఎస్సై
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూపాడుబంగ్లా ఎస్సై మల్లికార్జున హాజరయ్యారు.’అనంత అరణ్య’కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో 1,680 మొక్కలను ఎస్సై మరియు ప్రిన్సిపాల్ మొక్కలకు నీళ్లు పోసి నాటారు.ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ద్వారా చెట్లను నాటుతూ చెట్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్సై మరియు ప్రిన్సిపాల్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది రేష్మ,అశోక్,ఓబులమ్మ మరియు ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి,అనిల్,గోవర్ధన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


