ఆగస్టు12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం
1 min read
ఏలూరు అటవీ డివిజన్ పరిధిలో ఘనంగా అవగాహన కార్యక్రమాలు
జిల్లా అటవీశాఖ అధికారి డి ఎఫ్ఓ పీ.వి. సందీప్ రెడ్డి మార్గదర్శకత్వంలో విస్తృత అవగాహన
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ప్రపంచ ఏనుగుల దినోత్సవం (వరల్డ్ ఎలిఫెంట్ డే ) సందర్భంగా ఏలూరు అటవీ డివిజన్ పరిధిలోని వివిధ అటవీ శ్రేణులలో (రేంజస్ ) ఏలూరు జిల్లా అటవీశాఖ అధికారి (డి ఎఫ్ఓ) పీ.వి. సందీప్ రెడ్డి, ఐ.ఎఫ్.ఎస్. మార్గదర్శకత్వంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు మరియు సదస్సులు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాల్లో భాగంగా అటవీ డివిజన్ పరిధిలోని అన్ని రేంజ్లలో స్థానిక పాఠశాల విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు మరియు అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో పలు అవగాహన ర్యాలీలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి మాట్లాడూతూ క్రింది కీలక అంశాలను వెల్లడించారు.అడవుల పరిరక్షణలో ఏనుగుల పాత్ర: అడవులలో చెట్ల విత్తనాల వ్యాప్తికి, జీవవైవిధ్య సమతుల్యతను కాపాడటానికి ఏనుగులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన అటవీ పర్యావరణ వ్యవస్థకు (ఏకోసిస్టం) ఏనుగులు సూచికగా నిలుస్తాయన్ననరు. మానవ – వన్యప్రాణుల సహజీవనం: అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఉన్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటికి ఎలాంటి హాని తలపెట్టకూడదని కోరారు. మానవ-ఏనుగుల సంఘర్షణను (హ్యూమన్ ఎలిఫెంట్ కన్ఫ్లిక్ట్ ) నివారించడానికి అటవీశాఖ ప్రత్యేక నిఘా మరియు ట్రాకింగ్ బృందాలను నిరంతరం అందుబాటులో ఉంచుతోందని తెలిపారు.ఏనుగుల ఆవాసాల సంరక్షణ: ఏనుగుల సాంప్రదాయ కారిడార్లు (ఎలిఫెంట్ కోర్రిడార్స్ ) మరియు వాటి సహజ ఆవాసాలను పరిరక్షించడం మనందరి సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు: ఈ కార్యక్రమంలో వివిధ రేంజ్ల అటవీ శ్రేణి అధికారులు (ఎఫ్ ఆర్ ఓ ఎస్ ), డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు, అలాగే అటవీ సంరక్షణలో విశేష ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.


