దేశభక్తి, సమైక్య తకు మదనపల్లె మైలురాయిగా నిలిచింది
1 min read
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఎమ్మెల్యే షాజహాన్ బాషా
మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి : దేశభక్తి, జాతీయ సమైక్యతకు మదనపల్లె మైలు రాయిగా నిలిచిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం రెండవ రోజు టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నుంచి అనిబిసెంట్ సర్కిల్ వరకు భారీ జాతీయ సమైక్యతా ర్యాలీ నిర్వ హించారు.ఈ ర్యాలీలో వేలాది మంది పాఠశాల, కళాశాలల విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, కుల, ప్రజా సంఘాల ప్రతి నిధులు, మహిళలు, పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు వెయ్యి మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ, దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడు తూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించు కోవాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.మదనపల్లెలో అన్ని వర్గాల ప్రజలు ఒకే జెండా కింద ఐక్యంగా నిలిచి ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో అభినందనీయమని, కుల, మత, ప్రాంత భేదాలకు అతీ తంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, ఇదే దేశ ప్రగతికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహా రెడ్డి, విజయభారతి విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ సేతు, కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయ కులు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థు లు, మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


