NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘‘ఆర్​యూలో’’  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “హర్ ఘర్ తిరంగా”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  త్రివర్ణ పతాకంతోపాటు జాతీయ చిహ్నాలపట్ల, జాతీయతపట్ల దేశపౌరులంతా గౌరవాదరాలు పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా ఆయన వర్సిటీ పరిపాలనా భవనంవద్ద జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం సమర్పించారు. ఈ సందర్భంగా వర్సిటీ ప్రధాన ద్వారంవరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించి వి.సి. ప్రసంగించారు. స్వాతంత్ర్ర్యం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్న తరుణంలో యువత దేశంపట్ల భక్తివిశ్వాసాలను పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి. విజయకుమార్ నాయడు, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. నరసింహులు, వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య పి. వెంకట సుందరానంద్, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి, డీన్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, ఎన్​ఎస్​ఎస్​ కోఆర్డినేటర్ డాక్టర్ బి. కవిత, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్. పి. శివకిషోర్‌తోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. వికసిత్ భారత్ మరియు స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకోవడానికి కృషిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు.

About Author