కర్నూలులో అగస్త్య ఎనర్జీ లిమిటెడ్ ఇంగాట్ & వేఫర్ తయారీ ప్రాజెక్టు రూ.7,800 కోట్ల పెట్టుబడి
1 min read
– 3,500 ఉపాధి అవకాశాలు
కర్నూలు న్యూస్ నేడు: : అనుభవ్ అగర్వాల్ గ్రూప్ నందు భాగమైన అగస్త్య ఎనర్జీ లిమిటెడ్, కర్నూలు ఓర్వకల్ పారిశ్రామిక వాడలో సుమారు రూ.7,800 కోట్ల వ్యయంతో సమీకృత 12 GW ఇంగాట్ మరియు వేఫర్ గ్రీన్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టు స్థాపించనున్నట్లు ఈరోజు ప్రకటించినది. ఈ ప్రాజెక్టు సంస్థ ప్రస్తుత సోలార్ సెల్ మరియు మాడ్యూల్ తయారీ సామర్థ్యాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టు వలన 12 GW సమీకృత ఇంగాట్ మరియు వేఫర్ ఉత్పాద ఉత్పాదనలతో అగస్త్య ఎనర్జీ దేశీయ ఉత్పాదక సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది మరియు భారతదేశ సౌర ఉత్పాదక రంగంలో మరింత దేశీయ ఉత్పాదనకు అవకాశం కలుగుతుంది. అంతేకాక ఈ ప్రాజెక్టు స్థాపన వలన తదుపరి దశకు నాంది పలుకటమే కాక 3,500కు పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఫోటోవోల్టాయిక్ తయారీలో పోటీ పడే ప్రాజెక్టు స్థాపించాలనే అగస్త్య ఎనర్జీ లక్ష్యం నెరవేరుతుంది.
ఈ ప్రాజెక్టు సందర్భంగా శ్రీ అనుభవ్ అగర్వాల్, ఛైర్మన్ అనుభవ్ అగర్వాల్ గ్రూప్ (AAG) మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ధికి దోహదపడే ప్రాజక్టుల స్థాపన మరియు ఇంధన భద్రత దిశగా భారతదేశ సాధికారికతను పెంపొందించాలి అనే లక్ష్యం పైన మేము దృష్టి సారిస్తాము. అగస్త్య ఎనర్జీలో రూ.7,800 కోట్ల పెట్టుబడి, భారతదేశ ఇంధన పరివర్తనపై మా విశ్వాసాన్ని పెంచటమే కాక ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ సామర్థ్యతలను పటిష్టం చేయాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడమే కాక , దిగుమతులను తగ్గించుటకు ఒక పటిష్టమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం చాలా కీలకమని విశ్వసిస్తున్నాము.అగస్త్య ఎనర్జీ లిమిటెడ్ వారి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు సందర్భంగా శ్రీ పియూష్ బిచోరియా, డైరెక్టర్ అగస్త్య ఎనర్జీ వారు మాట్లాడుతూ, “ఇంగాట్ మరియు వేఫర్ తయారీ రంగంలో మా విస్తరణ, సమీకృత సౌర ఉత్పాదక వ్యూహంలో ఒక కీలకమైన ఉన్నత శిఖరంగా నిలుస్తుంది.ఈ సమీకృత ప్రాజెక్టు ఇంగట్, వేఫర్, సెల్ మరియు మాడ్యూల్ తయారీని ఒకే వేదిక పైకి తెస్తుంది. ఇది ఫోటోవోల్టాయిక్ యొక్క వాల్యూ చెయిన్ అప్‌స్ట్రీమ్ మరియు డౌన్‌స్ట్రీమ్ విభాగాలలో అధిక దేశీయ విలువలు చేకూర్చటమే కాక తయారీ సామర్థ్యం మరియు లోతైన ఏకీకరణ సాధ్యమవుతుంది.


