ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్
1 min read
ఏలూరు జిల్లా మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకం-క్రింద వన్ స్టాప్ సెంటర్
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్:వి. శ్రీనివాసరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మధ్యాహ్నం కళాశాల మహిళా సాధికారత విభాగం మరియు ఏలూరు జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకం – క్రింద వన్ స్టాప్ సెంటర్ నినాదంతో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్:వి. శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ వివాహ జీవితంలోకి అడుగుపెట్టబోయే అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి, అమ్మాయిలు మానసిక పరిపక్వత మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరాన్ని గురించి పేర్కొన్నారు.అనంతరం ఏలూరు జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి విచ్చేసిన మానసిక విశ్లేషకులు నాగశృతి విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ వివాహానికి ముందు అమ్మాయిలు శారీరక మానసిక సన్నద్ధతను గూర్చి ఆర్థిక స్వావలంబన గూర్చి వివరించారు.సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఏ విధంగా అధిగమించాలి, ప్రభుత్వ పరంగా ఉన్న సహాయాలను గూర్చి వివరించారు. కార్యక్రమాన్ని మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ టీవీఎస్ పద్మావతి సమన్వయం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు.డా:ఎం.విజయ కుమార్,టి వెంకట దుర్గాప్రసాద్,డాక్టర్ పిఆర్ కావ్య శ్రీ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.


