NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ప్రపంచ దోమల దినోత్సవం

1 min read

జెడ్ ఎమ్ ఓ నిర్మల్ అలెగ్జాండర్

మదనపల్లె ఆగస్టు 20, న్యూస్ నేడు ప్రతినిధి  : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో ఘనంగా ప్రపంచ దోమల దినోత్సవం జోనల్ మలేరియా అధికారి డాక్టర్ నిర్మల్ అలెగ్జాండర్,  జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డిల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. గురువారం ప్రపంచ దోమల దినోత్సవం  ప్రాముఖ్యత పై డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అవగాహన కల్పించారు. ముందుగా సర్ రోనాల్డ్ రాస్ కు  జెడ్ ఎమ్ ఓ. డాక్టర్ నిర్మల్ అలెగ్జాండర్, పరిపాలన అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఆర్బిఎస్ కే. జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ విష్షువర్ధన్  రెడ్డి, డిఎమ్ఓ రామచంద్ర రెడ్డి, ఎస్ఓ ఓబుల్ రెడ్డి, డిప్యూటీ. హెచ్ఈఓ.  మహమ్మద్ రఫీ, సబ్ యూనిట్ అధికారి ఖలీలుళ్ల ఖాన్ లు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లా డుచు సర్ రోనాల్డ్ రాస్ అనే బ్రిటీష్ వైద్యులు 1897 లో మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతొందని తెలిపారు.  ప్రపంచాన్ని వణికిస్తున్న మలేరియా జ్వరానికి కారణం ప్లాస్మోడియం అనే పరాణ్ణజీవని, ఈ పరాన్న జీవిని ఆడ అనాఫిలిస్ దోమ జీర్ణశయం లో గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పడం తో, మలేరియా వ్యాధి దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిసిందని గుర్తు చేశారు. ఈ ఆవిష్కరణ కు గాను రోనాల్డ్ రాస్ కు 1902 లో నోబెల్ బహుమతి వరించినది. దోమల నియంత్రణ చేపట్టడం వల్ల మలేరియా కేసులను గణనీయంగా తగ్గించ గలుగు తున్నామన్నా మని,  దోమలు లేని ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం కృషి చేద్దామనే నినాదం ఈ సంవత్సరం లక్ష్యం  అని తెలిపారు.  అనంతరం  కర పత్రాలు పంపిణీ చేస్తూ  అవగాహన ర్యాలీ నిర్వహించి  ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెల్త్ అసిస్టెంట్లు గంగయ్య గౌడ, కిరణ్, సురేంద్ర, ఏఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *