అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
1 min read
పరీక్ష నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు,న్యూస్ నేడు : విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్షను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్ శాఖలో AEE ఉద్యోగ పరీక్ష నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…విద్యుత్ శాఖలోని వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆగస్టు 23 నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ బాధ్యతలను TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.28 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, కర్నూలు జిల్లాలో సుమారు 4,982 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.ఈ సమావేశానికి ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ప్రదీప్ కుమార్ , సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రాఘవులు , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషాద్రి , ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు , తహసిల్దారులు కర్నూలు రూరల్ మరియు కల్లూరు లు రమేష్ , ఆంజనేయులు , జిజిహెచ్ డి ఎస్ ఓ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, ట్రాన్సకో పర్సనల్ ఆఫీసర్ సంతోష్ , సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి , అయాన్ డిజిటల్స్ మరియు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతినిధులు హాజరయ్యారు.



