ఆదోనిలో ఘనంగా జాతీయ సద్భావన దినోత్సవం
1 min read
ఆదోని, న్యూస్ నేడు : కులం, మతం, ప్రాంతం చూడకుండా అందరం భారతీయులం అనే సందేశంతో బుధవారం ఆదోనిలో జాతీయ సద్భావన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఆదోని మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల్లో ఐక్యత, సమైక్యత, సమగ్రత పెంపొందించడమే సద్భావన దినోత్సవ ముఖ్య ఉద్దేశం అన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా అందరం కలిసికట్టుగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, సమాజంలో చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి దేశ ప్రగతికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం సుమంగళి, రాజేంద్ర ప్రసాద్, నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. సద్భావన సందేశాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. చివరగా హాజరైన వారందరితో సద్భావన ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమైక్యత కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఈరన్న పాల్గొన్నారు.


