NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదల సంక్షేమమే తెదేపా లక్ష్యం

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు :  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమానికి  పెద్దపీట వేశారని  మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ  ఎన్. రాఘవేంద్ర రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లోని రాఘవేంద్రపురం కాలనీలో టీడీపీ  రెండేళ్ళు  నమ్మకం  – అభివృద్ధి –  సంక్షేమ కార్యక్రమాలు పై  టీడీపీ యువ నేత ఎన్  రాజారెడ్డి , మంత్రాలయం టీడీపీ పట్టణ అధ్యక్షుడు వరదరాజు ,నియోజకవర్గ బిసి సెల్ ప్రధాన కార్యదర్శి చిన్నభీమ తో కలిసి రెండో రోజు ఇంటింటికి ప్రచారం చేపట్టారు.  ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అదే సమయంలో స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఆర్ . లక్ష్మయ్య, జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి,  మంచాల సొసైటీ డైరెక్టర్లు డీసీ తిమ్మప్ప, చాపల నాగేష్ , క్లస్టర్ ఇన్చార్జి పవన్,  మంగలిమల్లి, మేకల నరసింహ, రాఘవేంద్ర, మడ్రి డేవిడ్,మారెప్ప నరసింహ ఆచారి, నరసింహ,భీమా,చిలకల డోనా హనుమంతు, వగరురు పవన్ కుమార్ ,కల్లుదేవకుంట రాగన్న మల్లయ్య, బీమా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *