సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లాలో సామాన్య, నిరుపేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి వినియోగ దారులకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పౌర సరపరాల శాఖ ఆద్వర్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ నంద్యాల వారు తెలిపారు. జిల్లాలోని 6 మండల కేంద్రాలలో నంద్యాల పట్టణం లో రెండు శ్రీనివాస నగర్ లోని Rythu బజార్ & నూనెపల్లి లోని వ్యవసాయ మార్కెట్ కమిటి నందు (2) , ఆళ్లగడ్డ , ఆత్మకూరు, బనగానపల్లి మరియు నందికొట్కూర్ కేంద్రాలలో బియ్యం ప్రతేక కౌంటర్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతేక కౌంటర్ ల ద్వారా స్టీమ్ బియ్యం (బీపీటీ) కిలో రూ.52 రూపాయలు (బహిరంగ మార్కెట్ ధర రూ. 62 రూపాయలు ఉంది), రా (ముడి ) బియ్యం (బీపీ టీ) కిలో రూ. 50 రూపాయలు (బహిరంగ మార్కెట్ ధర రూ.58 చొప్పున విక్రయిస్తున్నారని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల జిల్లా సివిల్ సప్లైస్ అధికారి జ్యోతి రవిబాబు, నంద్యాల ఆర్డీవో చల్లా. విశ్వనాధ్, తహసీల్దార్ అర్బన్ శ్రీనివాసులు, నంద్యాల రూరల్ తహసీల్దార్ శ్రీవాణి, ది నంద్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ -2 ప్రతినిధులు, శేఖర్ రెడ్డి ఉప తహశీల్దార్ (సివిల్ సప్లైస్) అధికారులు, రైతుబజార్ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


