NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మదనపల్లె ప్రజల దాహార్తి ని తీర్చడానికి ఎస్ ఎస్ ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తి చేయాలి

1 min read

పట్టణ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్లు విస్తరణ చేయాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా

మదనపల్లె ఆగస్టు 20, న్యూస్ నేడు తరణం ప్రతినిధి :119 సంవత్సరాల చరిత్ర కలిగిన మదనపల్లె ప్రజలు జిల్లా ఆకాంక్షను ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నేరవేర్చారని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. అమరావతిలో జరుగు తున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా  గురువారం ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో రోజురోజుకు పెరిగి పోతున్న ట్రాఫిక్ సమస్యను అధిగ మించడానికి ప్రధాన రోడ్లును విస్తరించాలని కోరారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె పట్టణం ఏర్పాటైన అనంతరం ట్రాఫిక్ సమస్య మరింత క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. శత సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన మరియు రవీంద్ర నాథ్ ఠాగూర్ బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసి దేశానికి జాతీయ గీతం జనగణ మన ను అందించిన బీటీ కళాశాలను యూని వర్సిటీగా అభివృద్ధి చేయాలని ముఖ్య మంత్రిని, ప్రభుత్వాన్ని కోరారు.కాగా మదనపల్లె సమ్మర్ స్టోరేజ్ లను గత ఏడాది ఇరిగేషన్ మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు పూర్తి చేయడానికి సుమారు 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు. అదే విధంగా టమోటా ఎగుమతుల్లో ఆసియా ఖండానికె అతి పెద్ద మార్కెట్ యార్డ్ గా గుర్తింపు పొందిన మదనపల్లె టమోటా రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సభ ద్వారా ముఖ్య మంత్రి కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *