NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు – త్వరలోనే ప్రజల మధ్యకు వస్తాం: ఎమ్మెల్యే

1 min read

కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొడతాం – స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతుంది

కార్యకర్తలు అధైర్యపడొద్దు.. పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలి

2029లో జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం: ఎమ్మెల్యే విరూపాక్షి

హోళగుంద న్యూస్ నేడు: అక్రమ కేసుల నేపథ్యంలో జిల్లా కారాగారంలో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి, వందవగిలి శేషన్నలు ములాఖత్ అయి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోగ్య పరిస్థితి, కేసుల వివరాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ తనపై నమోదు చేసిన కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. త్వరలోనే బయటకు వస్తామని, కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొడతామని అన్నారు.రాబోయే గ్రామపంచాయతీ, ఎంపీపీ, జడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతుందని ఎమ్మెల్యే విరూపాక్షి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా ఉన్నారని, కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వారి కోసం నిరంతరం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ఎమ్మెల్యే విరూపాక్షి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాటం చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్.కె. గిరి, వందవగిలి శేషన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే విరూపాక్షికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పూర్తి అండగా ఉంటారని తెలిపారు. అక్రమ కేసులకు భయపడకుండా పార్టీ కోసం ఐక్యంగా పనిచేస్తామని, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని, పార్టీ అధినాయకత్వం మరియు ఎమ్మెల్యే విరూపాక్షి నాయకత్వంలో ధైర్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *