NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి ఉంటుంది

1 min read

అసోసియేషన్ ఆఫ్అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

అసోసియేషన్ ఆఫ్ అలియాన్స్ క్లబ్స్

ఇంటర్నేషనల్  జిల్లా 117  ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థ 

కర్నూలు, న్యూస్​ నేడు:  నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ మరియు యునైటెడ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లీగల్ రైట్ ఫౌండేషన్  న్యూఢిల్లీ, వారి  సమన్వయ సహకారంతో ఆదోని అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో      మున్సిపల్ హై స్కూల్ సమావేశ మందిరంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందిస్తున్న సేవా తత్పరులకు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  విచ్చేసిన డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ మనకు ఉన్న దానిలో నలుగురికి సేవలు   చేసే సేవా గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్  రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ  అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్  ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో  అన్ని జిల్లాలు కలిపి  నేపాల్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కింద   పది లక్షల రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని 6 వ  తేదీన హైదరాబాదులో జరగబోయే అంతర్జాతీయ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు సమక్షంలో  పంపించనున్నామన్నారు. ఉప గవర్నర్ వంకదారు శ్రీనాథ్ గుప్తా, స్కూల్ హెడ్మాస్టర్ సుధాకర్ బాబు, ఎంఈఓ ఇంద్రావతి, కోఆర్డినేటర్ ప్రతాప్ ఈరన్న శెట్టి ముఖ్య అతిథులుగా, ప్రముఖ టీచర్ శ్రీదేవి యాంకర్ గా జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో  ఉత్తమ సేవా  అవార్డులను అందుకున్న వారిలో డాక్టర్లు,టీచర్లు,లాయర్లు ,ఇంజనీర్లు,సమాజ సేవకులు , ఆరోగ్య రంగం,లాంటి పలు కేటగిరీల్లో 21 మందికి  సమాజ సేవా అవార్డులు  ప్రధానం చేశారు . అవార్డు అందుకున్న ప్రముఖులలో ఇంజనీర్  విజయేంద్రప్రసాద్, ప్రఖ్యాత సమాజ సేవాకర్తలు వంకదారు శ్రీనాథ్ గుప్త, యాదగిరి వెంకటేశ్వర్లు, ప్రతాప్ ఈరన్న శెట్టి, రీసెర్చిర్ నగరికంటి వెంకటేష్ బాబు  . డాక్టర్లు మాధవి లత, విష్ణు తేజ కామవరo నరేష్,  మితిలేష్ కుమార్,రంజిత్ కుమార్, విశ్వనాథ్, జమీల్,  జర్నలిస్టు చిన్న ఈరన్న ఆడిటర్ వినయ్ కుమార్ టీచర్లు సుధాకర్ బాబు, యు.ఇంద్రావతి, ఫార్మసిస్ట్ ప్రత్యూష, మెడికల్ మరియు గ్రీనరీవిభాగం లో మిర్యాల శ్రీధర్, కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో  సతీష్, శ్రీనివాస్  మొదలగువారు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *