రాష్ట్ర ప్రజలకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
1 min read
రాష్ట్ర యాదవ సంఘం రాష్ట్ర అధ్య క్షులు తుర్లు ఆనంద్ యాదవ్
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిది : ఏపీ రాష్ట్ర యాదవ సంఘం అంధ్రప్రదేశ్ కార్యాలయం లో రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది, వైయస్సార్సీపి రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ తుర్లు ఆనంద్ యాదవ్ కు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జిగ గోపాల్ యాదవ్ కు, శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఘనంగా సన్మా నించారు. శుక్రవారం ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర ప్రజలకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆర్థికంగా, రాజ కీయంగా, విద్యా, ఆరోగ్య పరంగా దేవుడి ఆశీసులు ఎల్ల వేళలు ఉండా లని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ కృష్ణుని మనసార వేడుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున యాదవ్, విజయ్ లు పాల్గొన్నారు.


