ఎల్లార్తి దర్గాను దర్శించుకున్న ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి
1 min read
ఎల్లార్తి దర్గాలో ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి దర్శనం
హోళగుంద న్యూస్ నేడు: హజరత్ శేషావలి షేక్షావలి తాతకు మొక్కుబడి చెల్లింపు ఎల్లార్తి: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలోని హజరత్ శేషావలి షేక్షావలి తాత దర్గాను ఆదివారం ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, తన మొక్కుబడిని చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు, స్థానిక నాయకులు సీఐ రవిశంకర్ రెడ్డి ని సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికారు. అనంతరం దర్గా విశిష్టత, ఉరుసు ఏర్పాట్ల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోయ మల్లికార్జున్, జి.పి. మహబూబ్ బాషా, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చిదానంద, జలీల్ భాష, శశికాంత్, భీమలింగ, చంద్రశేఖర్, రాజశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



