NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జిల్లాలో గణేష్ ఉత్సవాలు  ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి

1 min read

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

రోడ్లను ఆక్రమించేలా లేదా ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా గణేష్ మండపాలు ఏర్పాటు చేయకూడదు.

వినాయక మంటపాల ఏర్పాటుకు అనుమతులు పూర్తిగా ఉచితం…https://ganeshutsav.net లో దరఖాస్తు చేసుకోండి.

ప్రతి మండపం వద్ద తాత్కాలిక సిసి టివి కెమెరాలు అమర్చుకునే విధంగా గణేష్ ఉత్సవ సమితి నిర్వహకులు చూడాలి.

అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టంతో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.

సోషల్ మీడియాలో వచ్చే  వదంతులను నమ్మవద్దు.

కర్నూలు, న్యూస్​ నేడు: సెప్టెంబర్  14 వ తేదీ నుండి  వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  వినాయక మంటపాల ఏర్పాటుకు https://ganeshutsav.net ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందని,  అనుమతుల కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పూర్తిగా ఉచితమని  కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదివారం తెలిపారు.జిల్లాలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో,  అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని కర్నూలు ఎస్పీ గారు  జిల్లా ప్రజలకు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు.జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్ లలో శాంతియుత సమావేశాలు ఏర్పాటు చేసుకొని  గణేష్ మండపాలు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాలు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.గణేష్ మండపాల ఏర్పాటుకు అవసరమైన పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్/పంచాయతీ, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల అనుమతులను సులభంగా ఒకే వేదిక ద్వారా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  గణేష్ ఉత్సవ్ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌లోనే అనుమతులు…

ప్రజలు https://ganeshutsav.net అనే వెబ్సైట్ నందు గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటి సభ్యుల వివరాలతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేసి దరఖాస్తును, ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు  చేసుకునే విధానం …

గణేష్ ఉత్సవాల నిర్వహణకు  మొదటగా దరఖాస్తు చేయదలచిన వారు https://ganeshutsav.net  వెబ్ సైట్ ఓపెన్  చేసి న్యూ అఫ్లికేషన్  అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

తరువాత దరఖాస్తు దారుని మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయవలయును.

తరువాత సదరు మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను నమోదు చేయవలయును.

ఆ తరువాత దరఖాస్తు దారుని పేరు, అడ్రస్ మరియు కమిటి సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధి లోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయవలయును.అప్లికేషన్ ఐడి నెం. (యూనిక్ ఐడి )  జనరేట్  చేయబడి, సదరు దరఖాస్తు పోలీస్ శాఖ యొక్క అనుమతి కోసం వారి లాగిన్స్  కు వెళుతుంది. అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి, అనుమతించిన తరువాత ఆ వివరాలు వెబ్ సైట్  నందు వచ్చును. దీనికోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.  అనుమతికి సంభందించిన క్యూ ఆర్ కోడ్  మరియు నిర్వాహకులు పాటించవలసిన నియమ నిబంధనలను తెలిపే ఒక  బుక్ లెట్ డౌన్ లోడ్ అగును.నిర్వాహకులు నిరభ్యంతర పత్రం (NOC) మరియు నియమ నిబంధనలు కూడిన పత్రాలను ప్రింట్ తీసి గణేష్ మంటపంలో ఉంచవలెను. గస్తీ  పోలీసులు క్యూ ఆర్  కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.అనుమతి పొందిన ప్రతి మండపానికి క్యూ ఆర్  కోడ్ తప్పనిసరిగా ఉండాలి. నిర్వాహకులు ఆ క్యూ ఆర్  కోడ్‌ను మండపం వద్ద స్పష్టంగా ప్రదర్శించాలి.విద్యుత్ వైరింగ్‌ను  సురక్షితంగా ఏర్పాటు చేయించాలి. షార్ట్ సర్క్యూట్‌లు, అగ్ని ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.మండపం వద్ద తగినంత ఇసుక, నీరు, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.ఉత్సవ కమిటీ సభ్యులు, వాలంటీర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.రాత్రి వేళల్లో మండపాల వద్ద కనీసం కొంతమంది బాధ్యత వహించేలా ఏర్పాటు చేసుకోవాలి.అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.మండపాల వద్ద, నిమజ్జన ఊరేగింపుల్లో  అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదు.మద్యం సేవించి అధిక సౌండ్ సిస్టం తో డ్యాన్స్ లు చేయడం వల్ల గుండెపోటు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే  వినియోగించాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, పోలీస్ స్టేషన్లు ,ప్రభుత్వ కార్యాలయాలు తదితర సున్నిత ప్రాంతాల వద్ద  నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.ఇతరుల మనోభావాలకు ఇబ్బందికలిగించకూడదుట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగినంత మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి.పోలీసుల అనుమతి లేకుండా ఊరేగింపులు నిర్వహించరాదు.సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దు…సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, నిర్ధారణ లేని వార్తలు, రెచ్చగొట్టే పోస్టులను నమ్మవద్దని, వాటిని ఫార్వర్డ్ చేయవద్దని ఎస్పీ  సూచించారు.ఏదైనా అనుమానం లేదా సమస్యలు ఉంటే స్ధానిక పోలీసులను సంప్రదించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు. జిల్లా ప్రజలు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు,యువత, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు పోలీసు శాఖకు  సహకరించాలని జిల్లా ఎస్పీ   కోరారు.ఎక్కడైనా సమస్యలుంటే  అత్యవసర పరిస్థితుల్లో డయల్–112  లేదా  డయల్–100 కు లేదా స్థానిక పోలీసులను గాని సంప్రదించాలని సూచించారు. కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీక గా  గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *