NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాణ్యత ప్రమాణాలతో కూడిన అభివృద్ధి

1 min read

నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలి

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆదివారం  నగరంలో చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోపు పనులను పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. ఆదివారం ఆయన 23, 24 వార్డుల పరిధిలో ఉన్న సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో వర్షాలు కురిసిన ప్రతిసారి నీటి ప్రవాహం కారణంగా శ్రీరామ్‌నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని సుద్దవాగు పరిసరాల్లో వరద పరిస్థితులు ఏర్పడి నీరు ఇళ్లలోకి చేరుతుండేదని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.2.50 కోట్ల వ్యయంతో 250 మీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు.కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, కాంట్రాక్టర్ మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *