NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం

1 min read

నూతన ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో మరింత మందికి సంక్షేమ భరోసా

అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి — దళారులను నమ్మి మోసపోవద్దు

ఆలూరు న్యూస్ నేడు: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ సాయాన్ని పెంచిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు మరింత మంది అర్హులకు పింఛన్ అందించే దిశగా సంక్షేమాన్ని విస్తరిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్ల ద్వారా అర్హులైన మరిన్ని కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతమ్మ ఆదేశాల మేరకు ఆలూరు పట్టణంలోని నాలుగు స్వర్ణ సచివాలయాల్లో నూతన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ సక్రమంగా జరుగుతుందా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా, సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితర పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే సమయంలో స్వర్ణ సచివాలయ సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించాలని, అన్ని వర్గాల ప్రజలకు సహకరించాలని సూచించారు. దరఖాస్తుల ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, దరఖాస్తుదారులకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్నందున ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన ప్రజలు మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని నాయకులు సూచించారు. పింఛన్ దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తోందని, ప్రజలు నేరుగా స్వర్ణ సచివాలయాలను సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నూతన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలూరు మండల సమూహ ఇన్‌చార్జి జేకే శేక్షావలి, కన్వీనర్ కేశవ్, డీలర్లు అంజి, అంబన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *