రెవెన్యూ,విజిలెన్స్ ఆధ్వర్యంలో కండ్రి గూడెం వద్ద అక్రమ రేషన్ పట్టివేత
1 min read
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఆకలి తీర్చాలని ఉద్దేశంతో రేషన్ బియ్యాన్ని అందిస్తుంది
అక్రమ రేషన్ వ్యాపారం చేసే వారిపై కఠినమైన చట్టాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కానీ కొంతమంది వారి ధనార్జన కోసం ఈ బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. ఏలూరు కండ్రి గుడెం వద్ద దెందులూరు కు చెందిన తాళ్లూరి నాగరాజు అనే వ్యక్తి 12 క్వింటాలు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు అనే పక్కా సమాచారంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ డిటి రమేష్ , విజిలెన్స్ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పట్టుబడిన తాళ్లూరి నాగరాజు పై 6A, 7i కేసులు నమోదు చేశారు. రెండు నెల క్రితం కూడా ఇతను వద్దనుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు కేసు నమోదు చేశారు అయిన ఇప్పటివరకు ఈ అక్రమ రేషన్ వ్యాపారాన్ని చేస్తూనే ఉన్నాడు.ఈ అక్రమ రేషన్ వ్యాపారం చేసే వారిపై కఠినమైన చట్టాలు లేకపోవడం వల్ల ఈ అక్రమ రేషన్ వ్యాపారం చేస్తూనే ఉంటున్నారు.దీనిపై కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.


