ప్రకృతి సాగుతో రైతుకు లాభం.. ప్రజలకు ఆరోగ్యం తహసీల్దార్ భారతి
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: రసాయన రహిత ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆర్థిక భరోసాతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని ప్యాపిలి తహసీల్దార్ భారతి అన్నారు.సోమవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ స్టాల్‌ను ఆమె సందర్శించారు. రైతులు పండించిన వివిధ రకాల సహజ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి వాటి నాణ్యతను అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు పెట్టుబడులు తగ్గి రైతులకు నికర లాభాలు పెరుగుతాయని తెలిపారు. నేల సారాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి సాగు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రజలు రసాయన అవశేషాలు లేని సహజ ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు.కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గోవిందరాజులు, రవికుమార్, నీలకంఠేశ్వర్, ఐసీఆర్‌పీలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.


