NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జి. పుల్లయ్య కళాశాలలో  స్మార్ట్ మెటీరియల్స్ పై జాతీయ స్థాయి సెమినార్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నేడు AICTE-VAANI (భారతీయ భాషల అభివృద్ధి మరియు పరిరక్షణ కోసం ఉత్సాహ భరితమైన కృషి) పథకం కింద “స్మార్ట్ మెటీరియల్స్ లో ఇటీవలి పోకడలు” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్ ను (సెప్టెంబర్ 7-8, 2026) ఘనంగా ప్రారంభించారు.జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సి శ్రీనివాసరావు మాట్లాడుతూ… AICTE స్పాన్సర్డ్ సెమినార్ల కోసం దేశవ్యాప్తంగా ప్రతిపాదనలు ఆహ్వానిస్తారని, వచ్చిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే AICTE మరియు ATAL సంస్థలు స్పాన్సర్ చేస్తాయని తెలిపారు. ఇటువంటి స్పాన్సర్డ్ సెమినార్లు యువ పరిశోధకులలో ఆవిష్కరణ స్ఫూర్తిని పెంపొందిస్తాయని, తద్వారా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు తీసుకురావచ్చని చెప్పారు.ఇది ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కు బలం చేకూర్చి, దేశాన్ని సాంకేతికంగా స్వావలంబన దిశగా నడిపిస్తుందని, యువ పరిశోధకులు స్థానిక భాషలో నేర్చుకుని, ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు చేసి, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లైన డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు డాక్టర్ సి నాగ కుమార్, ( మెకానికల్ విభాగం) అధ్యక్షతన నిర్వహించబడినది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *