NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

32 పతకాలు సాధించిన … కర్నూలు జిల్లా పోలీసు క్రీడాకారులు

1 min read

విజేతలను అభినందించిన … కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు.

 పురుషుల విభాగంలో రాష్ట్రంలోనే  హ్యాండ్ బాల్ లో మొదటిస్ధానం.

మహిళల విభాగంలో రాష్ట్రంలోనే  హ్యాండ్ బాల్ లో  మూడవ స్ధానం. కబడ్డీలో మూడవ స్ధానం. బాస్కెట్ బాల్ లో రెండవస్ధానం.

విడియోగ్రఫీ ,  రెజ్లింగ్ ,  మహిళల 10 కె రేష్ వాక్ లో రాష్ట్రంలోనే  మొదటి స్ధానం.

పురుషుల విభాగంలో రాష్ట్రంలోనే  హాకీ లో  రెండవ స్ధానం.

కర్నూలు, న్యూస్​ నేడు:  గుంటూరు నాగార్జున, విట్ యూనివర్సిటీలో సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ మరియు డ్యూటీ మీట్ లో కర్నూలు జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 32 పతకాలు సాధించారు.కర్నూలు జిల్లాకు చెందిన 63 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడాంశాల్లో పాల్గొని 7 బంగారు, 11 వెండి,  14 కాంస్య పతకాలు సాధించారు.సైంటి ఫిక్ ఎయిడ్స్ ఇన్విస్టెగేషన్ , విడియోగ్రఫీ ,  జూడో, ఆర్చరీ, అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్,  పవర్ లిఫ్టింగ్, బ్యాట్ మింటన్, హ్యాండ్ బాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, పుట్ బాల్, రెజ్లింగ్, ఆర్మ్ రెజ్లింగ్, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, తైక్వాండో, స్విమ్మింగ్ తదితర క్రీడాంశాల్లో కర్నూలు జిల్లా పోలీసు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలు ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను ఎస్పీ అభినందించారు.క్రీడలు పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు క్రీడాస్ఫూర్తి, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ  తెలిపారు.కర్నూలు జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన పోలీసు క్రీడాకారులు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో   కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్,  కర్నూలు ఒకటవ పట్టణ సిఐ మారుతిశంకర్,  పత్తికొండ సిఐ జయన్న , ఆర్ ఐ జావేద్,  ఎస్సై సామీర్ భాషా ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీసు క్రీడాకారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *