నిత్యవసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం
1 min read
కూటమి పాలనలో సామాన్యుడి బతుకు భారం
ధరలు ఆకాశానికి.. హామీలు గాలికి.. ప్రజలపై పన్నులు, చార్జీల భారం
నిత్యావసర ధరలు తక్షణమే తగ్గించాలి.సామాన్యుడికి ఊరట కల్పించాలి
కరువు రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్
బాదుడే బాదుడు కాదు.. ఇప్పుడు కుమ్ముడే కుమ్ముడు: మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి
గత ధరలు–ప్రస్తుత ధరలతో ప్లకార్డుల ప్రదర్శన
అన్నమయ్య జిల్లా , (న్యూస్ నేడు ప్రతినిధి) : కూటమి పాలనలో ధరలు పెంచి, ఎన్నికల హామీలను నెరవేర్చక ప్రజల నడ్డి విరుస్తున్నారని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కూటమి పాలనలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీంతో సామాన్యుడి బతుకు భారంగా మారిందని రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్ రెడ్డి పాల్గొన్నారు గత ధరలు–ప్రస్తుత ధరల వివరాలతో నిత్యావసర సరుకులను తోపుడు బండ్లపై ప్రదర్శించి ప్రభుత్వ తీరును నిరసించారు. పెంచిన ధరలను తగ్గించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు.ప్రజల మధ్యకు వెళ్లి.. ధరల పరిస్థితిపై ఆరాతీసిన శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డినిరసన అనంతరం శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి గాంధీ బజార్‌లోని దుకాణదారులు, కొనుగోలుదారులతో మమేకమై మార్కెట్‌లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. బియ్యం, పప్పులు, చక్కెర, వంట నూనెలు, ఉల్లిపాయలు, టమాటాలు తదితర నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ గోడును నాయకుల ఎదుట వెళ్లబోసుకున్నారు. ధరలు బాగా పెరిగిపోయాయి.. జీతాలు, ఆదాయాలు మాత్రం పెరగడం లేదు.. ఇంటికి అవసరమైన సరుకులు కొనాలంటేనే జేబు ఖాళీ అవుతోంది. ఏమి కొనేటట్లు లేదు.. తినేటట్లు లేదు అంటూ తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు.
రాయచోటి ప్రజల గొంతు కోశారు
రాయచోటిలో ఉన్న జిల్లా కేంద్రాన్ని తొలగించడం ద్వారా ఈ ప్రాంత ప్రజల గొంతు కోశారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటి పట్టణంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏలో రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు కోత విధించడం అన్యాయమన్నారు.గతంలో చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను సైతం తానే చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.జిన్నా షరీఫ్, జాకీర్, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్, మున్సిపల్ విబాగపు రాష్ట్ర కార్యదర్శి రియాజుర్ రెహమాన్, ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప, అష్రఫ్ అలీఖాన్, ఫయాజ్ అహమ్మద్, జాఫర్ అలీఖాన్, జనతా బషీర్, గౌస్ ఖాన్,అన్నా సలీం,సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, ఆర్ట్స్ శంకర్, యూసుఫ్ ఖాన్ ,వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, ఖాదర్ బాష,నవాజ్ క్రిష్, ఆనంద రెడ్డి, రాయచోటి అశోక్,సెల్ పాయింట్ మస్తాన్ , బేపారి జబీవుల్లా, బేపారి అసద్, రైతుమిత్ర ఖాదర్ బాష,కొలిమి అసద్ బాష,ఆప్ఝల్ ఖాన్, నూరుల్ అమీద్, సల్మాన్, వైఎస్ఆర్ ఖదీర్, సుబ్బారెడ్డి, రామాంజులు తదితరులు పాల్గొన్నారు.


