మట్టి వినాయక విగ్రహాల పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెనూ జోన్స్ ల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పోటీల విజేతలకు నేడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో బహుమతుల ప్రధాన కార్యక్రమము మరియు పర్యావరణ పరిరక్షణ పై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ.ఈ కిషోర్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు, జోనల్ ఆఫీసర్ నరేంద్రబాబు, నరసింహులుసుధాకర్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


