హంద్రీ నీవా నీటితో ఎస్ఎస్ ట్యాంకులతో పాటు చెరువులను నింపుతాం
1 min read
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగిస్తాం
ఎమ్మెల్యే షాజహాన్ బాషా
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతి నిది : మదనపల్లె పట్టణం లో రామ్ రెడ్డి లేఔట్ అనప గుట్ట అమ్మ చెరువు మిట్టతో పాటు వివిధ ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు ఎండిపోవడం జరుగుతొందని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఈ విషయం పై శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యా లయంలో మున్సి పల్ కమిషనర్ ఆధ్వర్యంలో నీటి సరఫరా సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తలెత్త కుండా తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై ఏపీ ట్రాన్స్ కొ డిఈ, ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారుల తో సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ తాగునీటి సమస్యను అధిగమించ డం కోసం ఈనెల 15వ తేదీ తర్వాత మదనపల్లెకు చేరుకునే హంద్రీ నీవా జలాలను అమ్మ చెరువుకను నింపి తద్వారా నీటి సరఫరాను యధావిధిగా పునరుద్ధ రిస్తామన్నారు. అంతే కాకుండా వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు పట్టణం లో రెండు సమ్మర్ స్టోరేజి ట్యాంకులను నీటితో నింపి పట్టణ, గ్రామీణ ప్రజలకు నీటి సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామ న్నారు. అదే విధంగా మదనపల్లె నియోజక వర్గానికి చెందిన ఐదు మంది లబ్ధిదారులకు రూ. 6 లక్షల 15 వవేలు ముఖ్య మంత్రి సహాయనిది చెక్కులను కూటమి నాయకుల తో కలసి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాష అందజేశారు.ఈ కార్యక్రమం లో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యా సాగర్, ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



