మట్టి గణపతి తయారీలో విద్యార్థుల సృజనాత్మకత
1 min read
ప్రధానోపాధ్యాయుడు మహేశ్వర్ రెడ్డి
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి కిందికేరి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని విద్యార్థులకు మట్టి గణపతి విగ్రహాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. మట్టి విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రకృతి పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు.అనంతరం ఉపాధ్యాయులు హరినాథ్ రెడ్డి, లక్ష్మి, గురువర్ధిని, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులు స్వయంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేశారు.


