NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఐటీడీపీ నాయకులు హనుమంతు

1 min read

ఐటీడీపీ కార్యక్రమాలు, యువత భాగస్వామ్యంపై చర్చ

హోళగుంద న్యూస్ నేడు: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ఐటీడీపీ నాయకులు హనుమంతు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఐటీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, యువత భాగస్వామ్యం తదితర అంశాలపై మంత్రి నారా లోకేష్‌తో చర్చించారు. డిజిటల్ వేదికల ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, యువతను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములను చేయడంపై చర్చ జరిగింది.యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని యువత సమస్యలను తెలుసుకుని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా నారా లోకేష్ చేసిన కృషికి హనుమంతు కృతజ్ఞతలు తెలిపారు. యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు.రానున్న రోజుల్లో ఐటీడీపీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసి, యువతను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తామని హనుమంతు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *