చెకుముకి పరీక్షల్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థుల ప్రతిభ
1 min read
ప్రైవేట్ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానం
ప్యాపిలి న్యూస్ నేడు: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ పరీక్షల్లో ప్యాపిలి శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో శిశు మందిర్ విద్యార్థులకు ప్రథమ స్థానం లభించింది.పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి ఫరూక్, 9వ తరగతి విద్యార్థిని వైష్ణవి, 8వ తరగతి విద్యార్థి అక్షయ్ కుమార్ ఈ విజయాన్ని సాధించారు. జనవిజ్ఞాన వేదిక నిర్వాహకులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను పాఠశాల ఆచార్య బృందం, ప్రబంధకార్యవర్గ సభ్యులు అభినందించారు. ఈ విజయం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని వారు పేర్కొన్నారు.


