NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టణంలో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ

1 min read

అభివృద్ధి పనులపై మంత్రి టీజీ భరత్ ను కలిసిన ఎమ్మెల్యే..

నందికొట్కూరు న్యూస్ నేడు: పట్టణ అభివృద్దే ముఖ్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోమంగళవారం ఉదయం మిడుతూర్ రోడ్డువిద్యానగర్ 11వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులతో 7 లక్షల 50 వేల నిధులతో సిమెంట్ రోడ్డుకుఎమ్మెల్యే పూజలు చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పట్టణంలో ప్రతి వార్డులోఅభివృద్ధి పనులతో పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి టీజీ భరత్

నందికొట్కూర్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని అదేవిధంగా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ను కర్నూలులో మంత్రి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే కలిసి సమస్యల గురించి విన్నవించారు. ఎమ్మెల్యే వినతితో మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అభివృద్ధి పనులు మరియు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి,మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,రజినీ కుమార్ రెడ్డి,కృష్ణారెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *