స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యం
1 min read
పగిడ్యాల,నందికొట్కూర్, మిడుతూర్ కార్యకర్తలతో డాక్టర్ సుధీర్..
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి స్వగృహం దగ్గర శుక్రవారం సాయంత్రం లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుదీర్ మాట్లాడుతూ మనం చేస్తున్న మంచి గురించి ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించాలన్నారు.ప్రతి గ్రామంలో మన అభ్యర్థి గెలవాలి మెజార్టీ తప్పనిసరిగా రావాలి. ఎంపిటిసి జడ్పిటిసి, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులను పోటీలో ఉంచుతామని ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. ఉదయం పగిడ్యాలలో మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి స్వగృహం దగ్గర కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అదేవిధంగా మధ్యాహ్నం నందికొట్కూరు మండల కార్యకర్తలతో వడ్డెమాను గ్రామంలో కార్యకర్తలకు ఎన్నికల గురించి దిశా నిర్దేశం చేస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం ఐక్యమత్యంతో కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు తర్వాత కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ అకార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి, తువ్వా చిన్న మల్లారెడ్డి, జగన్మోహన్ రెడ్డి,తులసి రెడ్డి,మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి,శివనాగిరెడ్డి,రాముడు,అన్వర్, షరీఫ్,చిన్న రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



